news logo

బిజినెస్

నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

November 7, 2019 11:43am

మొబైల్ ఫోన్ అంటే నోకియానే అన్నంత స్థాయిలో కొంతకాలం వరకు చక్రం తిప్పిన ఈ వ్యాపార దిగ్గజం తాజాగా సరికొత్త వ్యాపారంలో అడుగుపెడుతోంది. ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్న స్మార్ట్ టీవీల రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నోకియా సన్నద్ధమవుతోంది. నోకియా బ్రాండ్ పై వచ్చే ఈ స్మార్ట్ టీవీలు కేవలం ఫ్లిప్ కార్ట్ ఈ-కామర్స్ సైట్లోనే లభ్యమవుతాయి. ఈ అత్యాధునిక స్మార్ట్ టీవీల్లో సుప్రసిద్ధ జేబీఎల్ స్పీకర్లు ఉపయోగించనున్నారు. తద్వారా అత్యంత స్పష్టమైన ధ్వని వినియోగదారులకు సరికొత్త అనుభూతినిస్తుంది. అయితే, నోకియా ఈ స్మార్ట్ టీవీలను సొంతంగా తయారుచేయడంలేదు. దేశీయంగా తయారైన టీవీలను తన బ్రాండ్ పై విక్రయించనుంది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్, నోకియా మధ్య ఒప్పందం కుదిరింది. నమ్మకం, నాణ్యతలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నోకియాకు ఇది చారిత్రాత్మక అధ్యాయంగా భావిస్తున్నామని నోకియా బ్రాండ్ ఉపాధ్యక్షుడు విపుల్ మెహ్రోత్రా పేర్కొన్నారు.


Share to Twitter

 

 

Nokia super smart TV

 

Related