news logo

సంస్కృతి

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నమూనా విడుదల

June 26, 2019 2:51pm

దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు ఈ ఏడాది కొత్తరూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈసారి గణేశుడు ‘ద్వాదశాదిత్య మహా గణపతిగా’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ విగ్రహ నమూనాను తాజాగా విడుదల చేసింది. 12 తలలు, 24 చేతులు, సప్త అశ్వాలతో కూడిన సూర్యరథంపై ఈసారి గణనాథుడు కొలువు దీరనున్నాడు. ఈ వినాయకుడి విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయనున్నారు. ద్వాదశాదిత్య మహా గణపతికి కుడివైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి, ఎడమవైపున బ్రహ్మవిష్ణుమహేశ్వర సమేత దుర్గాదేవి దర్శనం ఇవ్వనున్నారు.


Share to Twitter

 

 

Sri Dwadashaditya Maha Ganapathi

 

Related