ఇస్రో ఖాతాలో మరో విజయం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్-2బీఆర్1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్-1ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ46 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ..పీఎస్ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. చారిత్రకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 9-16 మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు. చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం తర్వాత సెప్టెంబరులో చంద్రుడిపై కాలుమోపుతామని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఆతర్వాత హైరెజెల్యూషన్ కాటో 3 ఉపగ్రహం సహా మరికొన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని శివన్ తెలిపారు.
ISRO-successfully-launches-pslv-c46
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
November 19, 2019 1:07pmమంచు తుపాన్ లో చిక్కుకున్న 8 మంది భారత జవాన్లు
November 19, 2019 1:02pm‘భారత్‌కు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సిందే’
November 19, 2019 12:59pmపర్యావరనానికి హానికలిగించే ప్లాస్టిక్ తో...ప్లాస్టిక్ ఇటుక
November 19, 2019 12:04pmసీజేగా బాబ్డే ప్రమాణ స్వీకారం
November 18, 2019 11:53amనన్ను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటా...
November 7, 2019 11:38amఅయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని
November 7, 2019 11:18amప్రైవేటు రూటు పర్మిట్లపై రేపు ప్రకటన!
November 7, 2019 11:15am603 క్వింటాళ్ల అక్రమ ఉల్లి నిల్వలు
November 7, 2019 11:10amఆనంద్ మహీంద్ర నుంచి ఊహించని గిఫ్ట్
October 23, 2019 3:53pmమోదీపై ఆత్మాహుతి దాడి చేస్తా: పాక్ సింగర్
October 23, 2019 3:07pm'విక్రమ్'డు ఏమయ్యాడో...నాసా తాజా చిత్రాల్లోనూ కనిపించని జాడ!
October 23, 2019 1:08pmతగ్గిన ఓజోన్ రంధ్రం పరిమాణం: నాసా వెల్లడి
October 23, 2019 1:03pmపాక్ కుయుక్తులకు నిఘా వర్గాల చెక్
October 23, 2019 12:51pmబ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం...
October 23, 2019 12:49pmహైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో లైంగిక వేధింపులు... నేహా అనే యువతి ఆత్మహత్యతో తీవ్ర కలకలం!
October 18, 2019 11:17amకల్కి ఆశ్రమంలో గుట్టగుట్టలుగా నగదు
October 18, 2019 11:14amభారతీయులను వెనక్కి పంపిన మెక్సికో
October 18, 2019 11:07amకాలేయ సమస్యలతో ముంబై ఆస్పత్రిలో అమితాబ్..
October 18, 2019 11:03amజాబిల్లిపై మళ్లీ ప్రారంభమైన పరిశోధనలు.. ఫొటోలు పంపిన చంద్రయాన్-2 ఆర్బిటర్
October 18, 2019 10:50amలంగరుకు తగిలింది.. రెయిలింగ్ ఊడొచ్చింది
October 18, 2019 10:48amతెల్లటి గుర్రంపై ప్రమాదకర పర్వతాలపై కిమ్ జోంగ్ ఉన్ స్వారీ
October 17, 2019 10:53amఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.. కశ్మీర్లో కొనసాగుతున్న భీకర ఎన్కౌంటర్
October 16, 2019 11:06am‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’
October 14, 2019 12:32pm