news logo

సంస్కృతి

శబరిమల ఆలయం మూసివేత...మహిళల ప్రవేశం కారణంగా సంప్రోక్షణ

January 2, 2019 11:28am

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఇద్దరు 50ఏళ్లలోపు మహిళలు నేడు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళల ప్రవేశంతో శబరిమల ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. కోజికొడె జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. వీరి ప్రవేశంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తంత్రి.. ఆలయాన్ని మూసివేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ధ్రువీకరించిన సీఎం విజయన్‌.. కాగా.. మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధ్రువీకరించారు. ‘50ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు నేడు ఆలయాన్ని దర్శించుకున్నారనేది నిజం. అంతకుముందు భద్రతా కారణాల వల్ల వారు ఆలయంలోకి వెళ్లలేకపోయారు. అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాం’ అని పినరయి తెలిపారు.


Share to Twitter

 

 

Ayyappa Temple

 

Related